పెళ్ళిలో మరాఠి అమ్మాయిగా అలరించి౦ది..

SMTV Desk 2018-05-24 16:01:18  pooja hegde, maharastra marriage, photos viral.

హైదరాబాద్, మే 24 : ఈ ఫోటో చూస్తే పూజా హెగ్డే అచ్చం పెళ్లి కూతురిలా ఉంది కదూ..! ఆమె పెళ్లి కుదిరిందా అనుకుంటున్నారా.? అవును పెళ్ళే కాని పూజ హెగ్డేడి కాదు ఆమె స్నేహితురాలు కృతికది. తన ప్రాణ స్నేహితురాలైన మరాఠి అమ్మాయి పెళ్ళిలో తోడి పెళ్లికూతురిగా సందడి చేసింది ఈ సుందరీ. స్వతహాగా పూజా హెగ్డే ది మంగుళూరు అయినా.. ఆమె పుట్టి పెరిగిందీ మహారాష్ట్రలోని ముంబైలో. అక్కడి మరాఠీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కృతిక. వీళ్లిద్దరూ బాల్య స్నేహితులు! ఈ మేరకు సోషల్ మీడియాలో పూజా హెగ్డే.. "నా సన్నిహిత మిత్రురాలి పెళ్ళిలో మరాఠీ తోడి పెళ్లికూతురిగా సందడి చేస్తున్నా. మేమిద్దరం చిన్నప్పుడే ఒకరి పెళ్లిలో మరొకరు ఇలా సందడి చేయాలనుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది" అని పోస్ట్ చేశారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" చిత్రంలో జిగేలు రాణి అంటూ చిందులు వేసింది ఈ మంగళూరు అమ్మాయి. మరోవైపు ఎన్టీఆర్ సరసన "అరవిందా సమేత' సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు 25 వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.