హాట్ లుక్స్ తో అదరగొడుతున్న సోనమ్..

SMTV Desk 2018-05-24 12:12:33  sonam kapoor, femina magazine, sonam latest edition.

ముంబై, మే 24 : బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఇటీవల ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య 72 అంతర్జాతీయ చలనచిత్ర వేడుక కేన్స్.. కు హాజరై సరికొత్త డ్రెస్ లతో వీక్షకులను తనవైపుకు తిప్పుకుంది. తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. తాజాగా ఈ భామ ఫెమినా మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కు కవర్ పేజ్ షూట్ ఇచ్చేసింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకుని.. చిరునవ్వుతో దర్శనమిచ్చింది. మొత్తంగా హాట్ హాట్ లుక్స్ తో ఈ అమ్మడు ఇచ్చిన పోస్ కి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతున్న సోనమ్ తాజా చిత్రం "వీరే ది వెడ్డింగ్" చిత్రం జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సోనమ్‌ కపూర్‌తో పాటు కరీనా కపూర్, స్వరా భాస్కర్‌, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. నలుగురు స్నేహితురాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి౦చారు.