సమ్మర్ ట్రిప్ లో అనసూయ.. ఫోటోలు వైరల్..

SMTV Desk 2018-05-23 17:37:50  ANASUYA, SUMMER TRIP, LADAKH, ANASUYA AND FAMILY.

హైదరాబాద్, మే 23 : "రంగస్థలం" సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను అలరించిన యాంకర్‌ అనసూయ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఆమె నటనకు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ఇటీవల కుటుంబం సమేతంగా విహారయాత్రకు వెళ్లారు. లడఖ్‌లో తన భర్త, ఇద్దరు పిల్లలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే అనసూయ పిల్లలకు వేసవి సెలవులు కారణంగా సరదాగా విహారయాత్రకు వెళ్లారట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి ఒక్కరిది చెప్పుకోదగ్గ పాత్ర. హీరో రామ్ చరణ్, సమంత పాత్రలకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇంతవరకు తమ కెరీర్ లో వారు ఇలాంటి పాత్రలు చేయలేదు. ప్రస్తుతం అనసూయ "సచ్చిందిరా గొర్రె" అనే సినిమాలో నటిస్తుంది.