మావయ్య సలహా తీసుకున్న చైతూ

SMTV Desk 2017-07-09 18:36:47  Citing the uncles advice

హైదరాబాద్, జూలై 9 : రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ఆ మూవీ తర్వాత డెబ్యూట్ డైరెక్టర్ కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో "యుద్ధం శరణం" సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో చైతూకి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు నాన్న నాగార్జున సలహాలు తీసుకున్న చైతూ ఈ సినిమాని మాత్రం వెంకీ సలహాతోనే ఓకే చేశాడట. ఇటీవలే ఈ విషయాన్నీ అభిమానులతో షేర్‌చేసుకున్నాడు చైతూ. ఈ స్క్రిప్ట్ తనకు సరిగ్గా మ్యాచ్ అవుతుందని వెంకీ చెప్పడంతో చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో చైతూ కాలేజీ డ్రాపవుట్‌గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్, రావురమేశ్, రేవతి ఈ మూవీలో కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.