ప్రేమతో చంపేశారు.. థాంక్యూ...

SMTV Desk 2018-05-22 14:47:51  manchu manoj, birthday gift, twitter, manoj fans video.

హైదరాబాద్, మే 22 : హీరో మంచు మనోజ్.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ రాకింగ్ స్టార్ ఆదివారం తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్స్ చేశారు. అయితే కొంతమంది మనోజ్ పై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఆయన సినీ కెరీర్‌ను రివ్యూగా చేసి ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో ఆయన సినిమా విజయాలతోపాటు వైఫల్యాల్ని కూడా ప్రస్తావించారు. ఇది మనోజ్‌కు చాలా బాగా నచ్చేసింది. ఈ వీడియో చూసిన ఆయన ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. ఈ వీడియోను చేసిన వారు ప్రేమతో నన్ను చంపేశారు. ఇది నా ఉత్తమమైన పుట్టినరోజు కానుక. దీన్ని రూపొందించినందుకు ధన్యవాదాలు. కచ్చితంగా కష్టపడి, మంచి సినిమాలు చేస్తానని మాటిస్తున్నా. హృదయపూర్వకంగా మీ అందర్నీ ప్రేమిస్తున్నా"న౦టూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.