వైఎస్ షర్మిలగా "భూమిక"..!!

SMTV Desk 2018-05-22 14:09:50  yatra movie, ysr biopic, bhumika, ys sharmila.

హైదరాబాద్, మే 22 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి "యాత్ర" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ చిల్లా, శశి దేవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నటీనటులపై స్పష్టత రాలేదు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ భూమిక వైఎస్ఆర్ కూతురు షర్మిలగా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ పాత్రలో ఎవరు నటించనున్నారు? అన్నది తెలియాల్సి ఉంది. ఇక వైఎస్ఆర్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి(బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ఫేం) నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలన్ని౦టిపై ఒక క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. భూమిక ఈ మధ్యనే నేచురల్ స్టార్ నాని "ఎ౦సీఏ" చిత్రంలో ఆయన వదినగా నటించారు. ఈ చిత్రంతో ఆమె మరలా తెరంగేట్రం చేసి పలు చిత్రాలలో ముఖ్య పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. వరుస అవకాశాలతో, షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ బయోపిక్ లో షర్మిలగా మన ముందుకు రానున్నారు.