రాఘవేంద్ర రావు పై కామెంట్ చేసిన తాప్సీ

SMTV Desk 2017-07-09 18:20:45  Top, heroine, made, by, sensational, comments

హైదరాబాద్, జూలై 9 : 2010లో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆమెను తెరకు పరిచయం చేశారు. హిందీలో సినిమా ఆఫర్లు దక్కించుకున్న తాప్సీ దక్షిణాది సినీ ఇండస్ట్రీని చులకన చేసినట్టు మాట్లాడేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ, తనకు సినీ జీవితం ప్రసాదించిన రాఘవేంద్రరావుపైనే విమర్శలు చేసింది. ఝుమ్మందినాదం సినిమాలోనూ తాప్సీ బొడ్డుపై పండ్లు వేసే సన్నివేశం ఉంటుంది. దర్శకుడు సహజంగానే హీరోయిన్ల బొడ్డుపై పండ్లు వేసే సన్నివేశాలను పెడుతుంటారని ఆమె విమర్శలు చేశారు. నా తొలి సినిమాను డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు గారు అప్పటికే వందకు పైగా చిత్రాలు తీశారు. శ్రీదేవి, జయప్రద వంటి వారిని స్టార్లుగా తీర్చిదిద్దారు. అదేం విచిత్రమో తెలియదు కానీ.. ఆయన తన సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, పువ్వులతో కొట్టిస్తుంటారు. నేను కూడా ఆయన డైరెక్షన్లో సినిమా చేసి ఏ శ్రీదేవినో అయిపోతానని అనుకున్నా. కానీ, నా తొలి రోజు షూటింగే పాటతో ప్రారంభమైంది. ఆ పాటలో నా బొడ్డును కొబ్బరి చిప్పతో కొట్టించేశారు. ఆయన అలా ఎందుకు కొట్టించారో నాకైతే ఇప్పటిదాకా తెలియదు అని చెప్పుకొచ్చింది తాప్సీ. అంతేకాకుండా దక్షిణాది సినీ అభిమానులపైనా ఆమె వ్యాఖ్యలు చేస్తూ పింక్ చిత్రం చేసే దాకా.. తను గ్లామరస్ పాత్రలే కాకుండా మంచి పాత్రలు కూడా చేయగలనని దక్షిణాది ప్రేక్షకులకు తెలియదనుకుంటానంటూ వ్యాఖ్యానించింది. తాప్సీ వ్యాఖ్యాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తనకు తెలుగు సినిమాల వల్లే హిందీలో అవకాశాలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ, తన సినీ ప్రస్థానానికి మూలం మరచిపోయి మాట్లాడుతుందని అనే హాష్‌టాగ్‌ ద్వారా తాప్సీపై విమర్శలజడికి తెరతీశారు నెటిజన్లు.