చిన్నారి కల నెరవేర్చిన జనసేనాని..

SMTV Desk 2018-05-19 19:17:57  pawan kalyan, janasena chief, hyderabad, revathi patient

హైదరాబాద్, మే 19 ‌: జనసేన అధినేత, కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ చిన్నారి కలను నిజం చేశారు. రేవతి అనే చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె శరీరంలోని ఒక్కో అవయవం చచ్చుబడిపోతోంది. వైద్యం చేయించుకునే స్థోమత లేక చిన్నారి తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కాగారేవతికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. ఆయన్నుకలవడమే తన కల అని చిన్నారి తల్లి చెప్పారు. ఈ క్రమంలో పవన్‌ తాజాగా రేవతిని కలిశారు. చిన్నారిని ఆప్యాయంగా ఒడిలో కూర్చోబెట్టుకుని, మాటలు చెప్పారు. చిన్నారి కూడా ఎంతో ఆనందంగా పవన్‌కు కబుర్లు చెప్పి.. పాట కూడా పాడింది. పవన్‌ ఆనందంతో చిన్నారిని ముద్దుపెట్టుకున్నారు. అంతేకాదు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను జనసేన పార్టీ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. పవన్‌ తన కుమార్తె కల నెరవేర్చారంటూ చిన్నారి తల్లి ధన్యవాదాలు చెప్పారు.