బ్రేకింగ్ న్యూస్ : యడ్యూరప్ప రాజీనామా..

SMTV Desk 2018-05-19 16:12:58  #karnataka assembly, yeddyurappa resignation, bjp, congress-jds

కర్ణాటక, మే 19 : కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విఫలమైంది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సాగిన కన్నడ రంగస్థలంలో చివరకు యడ్యూరప్ప తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేశారు. ఈ రోజు 4.00 గంటలకు విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన ఆయన ఒకింతా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లను ఓటర్లనమ్మలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు.