నిఖిల్ కి జోడీగా లావణ్యత్రిపాఠి..!!

SMTV Desk 2018-05-18 18:37:24  NIKHIL HERO, LAVANYA TRIPATI HEROINE, ARA SINIMAS PRIVATE LIMITED.

హైదరాబాద్, మే 18 : వరుస సినిమాలతో మంచు దూకుడు ప్రదర్శిస్తున్నాడు హీరో నిఖిల్. "కిర్రాక్ పార్టీ" వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత టీ.యన్.సంతోష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా లావణ్యత్రిపాఠి నటిస్తోంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌లపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మధు సమర్పిస్తున్నారు. ఇటీవల కాలంలో అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్ లావణ్యత్రిపాఠి కి ఈ చిత్రం తప్పకుండా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది.