గురు పౌర్ణమి వేడుకలు

SMTV Desk 2017-07-09 12:20:22  guru, pournami, celabretions,

హైదరాబాద్, జూలై 9 : చరిత్రలో ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. గురువును దైవంగా పూజించే ఆషాఢపూర్ణిమ ఈ రోజే. బుద్ధుడు తన నాలుగు సూత్రాలను తెలిపింది కూడా ఈరోజే. అసలు ఉత్సవాలను జరుపుకొమ్మని చెప్పని సాయి బాబా గురుపూర్ణిమను మాత్రం చేసుకొమ్మని ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సద్గురు సాయిబాబా ఆలయాలు తెల్లవారుజాము నుండే భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. బాబా దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట సాయిబాబా ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గురుపౌర్ణమి వేడుకలను షిర్డీలో ఘనంగా నిర్వహిస్తున్నారని సమాచారం.