నిజమైన హీరో మహేష్..

SMTV Desk 2018-05-18 16:01:25  MAHESH BABU, NAMRATHA, NGO, DONATED MONEY.

హైదరాబాద్, మే 18 : సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నాడు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ప్రిన్స్.. ఇప్పటికే బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని.. వాటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు మురికి వాడల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో సంస్థకు మహేశ్‌ దంపతులు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని సదరు సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడిస్తూ... "భరత్ అనే నేను" చిత్రం రిలీజ్ కు ముందే వారు ఆర్థికసాయం అందజేశారని తెలిపారు. అప్పుడే ఈ విషయమై ప్రకటన చేస్తే.. అది సినిమా ప్రచారం కోసమే అవుతుందని ఇలా చేశామంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ సంస్థ ద్వారానే పేద క్రీడాకారుల కోసం ఉచిత స్పోర్ట్స్‌ రిహాబ్‌ సెంటర్‌ ప్రోగ్రామ్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గత ఆరేళ్లలో రోజుకు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిందట. "మహేష్ దంపతులు ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి ఆర్థిక సహాయం అందించడం, వారిని ఆప్యాయంగా పలకరించడం నిజంగా ఒక అద్భుతం" అంటూ సదరు సంస్థ వెల్లడించింది.