బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ షూరూ..

SMTV Desk 2018-05-18 15:52:29  voters list, panchayati elections, hyderabad panchayati elections, voters list

హైదరాబాద్‌, మే 18 : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ ఈ రోజు నుంచి వెనుకబడిన తరగతులు ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఆరంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయితీల్లో జూన్‌ 1 నాటికి ఈ ప్రక్రియను పంచాయితీరాజ్‌ శాఖ ముగించనుంది. బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వగానే సర్పంచులు, వార్డు మెంబర్ల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు తెలియజేయనుంది. గ్రామపంచాయితీలకు సంబంధించిన ఓటర్ల జాబితా ముసాయిదాను గత నెల 30న ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అన్ని గ్రామపంచాయితీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు కోసం షెడ్యూల్‌ను సైతం ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది.