నయన్ ఇలా కూడా చేస్తోందా..!!

SMTV Desk 2018-05-18 11:45:18  nayanatara, kolamavu kokila movie, nelson dilip.

హైదరాబాద్, మే 18 : లేడి ఓరియె౦టెడ్ చిత్రాలలో నటిస్తూ అరుదైన గుర్తింపును సాధించిన హీరోయిన్ నయనతార. అయితే నయన్ ఇప్పటి వరకు పోషించని ఒక సరికొత్త పాత్రను "కొలమావు కోకిల" అనే తమిళ చిత్రంలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్ర ఏంటో తెలుసా..? డ్రగ్స్ అమ్మే పాత్ర. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ పాత్ర గురించి వివరించగానే వెంటనే నయన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో నయనతార పాత్ర అంత గొప్పగా ఉండబోతుందట. ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన యువతి.. ఎలా బ్రతకాలో తెలికా.. మాదకద్రవ్యాలను అమ్మడం వైపు ఎలా వెళ్ళిందనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు భయపెట్టే పాత్రలలో అలరించిన నయన్ కు ఈ పాత్ర కచ్చితంగా అవార్డులను తెచ్చిపెడుతుందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.