ఏబీడీ.. స్పైడర్ మ్యాన్ క్యాచ్ చూశారా..?

SMTV Desk 2018-05-18 11:40:01  ab devilliers stunning catch, abd super men catch, ipl, rcb vs srh

బెంగుళూరు, మే 18 : ప్రపంచ క్రికెట్ లో ఏబీ డివిలియర్స్‌ అంటే బ్యాటింగ్, ఒక్కటే కాదు ఫీల్డింగ్ లో కూడా చాలా చురుకుగా ఉంటాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తో అలరించిన ఏబీడీ (69) తర్వాత ఫీల్డింగ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. బెంగుళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆర్సీబీ బౌలర్‌ మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌ ఆఖరి బంతిని అలెక్స్‌ హేల్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డివిలియర్స్‌ స్పైడర్ మ్యాన్ ల గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ క‍్రమంలోనే బౌండరీ లైన్‌ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏబీడీతో పాటు, మొయిన్‌ అలీ (65)లు చెలరేగి ఆడగా, గ్రాండ్‌ హోమ్ ‌(40‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీస్కోర్ నమోదుచేసింది. హైదరాబాద్ జట్టులో విలియమ్సన్‌ (81), పాండే (62) పోరాడిన జట్టును గెలిపించాలేకపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.