రాయుడుపై పాట రాసిన మార్క్‌వుడ్‌

SMTV Desk 2018-05-16 17:12:18  markwood, ambati rayudu, mark wood vedio, ipl

పుణె, మే 16: ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల తర్వాత ఈ సీజన్‌లో అడుగుపెట్టి అద్భుతంగా రాణిస్తుంది. ముఖ్యంగా చెన్నై జట్టులో బ్రావో సహచర ఆటగాళ్లను ఆట పట్టిస్తూ, డ్యాన్స్‌లు చేసిన వీడియోలు అభిమానులు ఎంతోగానో అలరించాయి. తాజాగా హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు గురించి చెన్నై ఆటగాడు మార్క్‌వుడ్‌ ఓ పాట పాడాడు. ఆ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. కొన్ని కారణాల వల్ల మార్క్‌వుడ్‌ మధ్యలోనే ఐపీఎల్‌ను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్‌లో వుడ్‌ చెన్నై తరఫున కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అది కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే. తాజాగా మార్క్‌వుడ్‌ డ్రస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల మధ్య రాయుడుపై రాసిన పాటను పాడుతూ కనిపించాడు. వుడ్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తమ గొంతుతో పాటు కాలును కదిపారు. "డు..డు..డు.. అంబటి రాయుడు" అంటూ సాగే ఈ పాటను మార్క్‌వుడ్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వుడ్‌ పోస్ట్‌ చేసిన ఈ పాట అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి. ప్రస్తుత ఐపీఎల్‌ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లలో రాయుడు ఒకడు. 12 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన చూసిన బీసీసీఐ సెలక్టర్లు రాయుడుకి తిరిగి భారత జట్టులో ఆడే అవకాశాన్ని సైతం కల్పించారు.