కులదీప్ మ్యాజిక్..

SMTV Desk 2018-05-16 11:05:15  kuldeep yadav, kkr vs rr, ipl-11, dinesh karthik

కోల్‌కతా, మే 16 : కీలక మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు విజయాన్ని సాధించింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పై 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. 13 మ్యాచ్‌ల్లో ఏడో విజయం సాధించిన ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరువైంది. మరోవైపు ఏడో ఓటమితో రాయల్స్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. కోల్‌కతా జట్టులో మణికట్టు స్పిన్నర్ కులదీప్ యాదవ్ (4/20), ఆండ్రి రసెల్‌ (2/13) దెబ్బకు ధాటికి రాజస్థాన్ 19 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. తొలుత టాస్ నెగ్గిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్ ను సునామీల మొదలుపెట్టింది. భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్‌, అతడికి తోడుగా వచ్చిన రాహుల్‌ త్రిపారి (27; 15 బంతుల్లో 4×4, 1×6).. పూనకం వచ్చినట్లుగా కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 6, 4, 4, 4, 6, 4, 4, 6, 4.. ఒక దశలో వరుసగా పది బంతుల్లో వీళ్లిద్దరూ కలిసి సాగించిన విధ్వంసమిది. కానీ అనూహ్యంగా కోల్‌కతా బౌలర్లు పుంజుకున్నారు. కుల్‌దీప్‌ రంగప్రవేశంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అతను ఓవైపు వికెట్లు తీస్తూ.. మరోవైపు పరుగులు కట్టడి చేశాడు. చివరిలో ఉనద్కత్‌ ధాటిగా ఆడటంతో ఆ జట్టు అతి కష్టం మీద 142 చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాకు నరైన్‌ (21; 7 బంతుల్లో 2×4, 2×6) మెరుపు వేగంతో ఆడాడు. గౌతమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో వరుసగా 6, 4, 6, 4 కొట్టి అతను కోల్‌కతాకు శుభారంభం అందించాడు. అయితే స్టోక్స్‌ తన రెండో బంతికే నరైన్‌ను వెనక్కి పంపించాడు. అనంతరం ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (45; 42 బంతుల్లో 5×4, 1×6), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (41 నాటౌట్‌; 31 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని నైట్‌రైడర్స్‌ రెండు ఓవర్లుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కులదీప్ యాదవ్ కు దక్కింది.