ఈవీఎం.. "ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ" : కోన వెంకట్

SMTV Desk 2018-05-15 18:41:04  KARNATAKA ELECTIONS, KONA VENKAT COMMENT, HERO NIKHIL COMMENT

హైదరాబాద్, మే 15 : కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరి అంచనాలకు అతీతంగా వెలువడుతున్నాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజయం బీజేపీ వైపునకు చేరిపోయింది. తాజా ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సినీ ప్రముఖులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోన వెంకట్.. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఓ ట్వీట్ చేశారు. "ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)లను ఓపెన్ చేశారో.. అప్పుడే రిజల్ట్స్ ఈవీఎం(ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ) అని తెలిసిపోయింది. నో కామెంట్స్!" అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. ప్రముఖ హీరో నిఖిల్ స్పందిస్తూ.. "నోట్ల రద్దు, జీఎస్టీ, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉండటం లాంటి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ... మరోసారి బీజేపీనే గెలుస్తోంది. ప్రధాని మోదీ మెజీషియన్ లా కనిపిస్తున్నారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా. అమిత్, షా, బీజేపీలకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు.