ఎన్టీఆర్ సినిమాలో రంభ..!!

SMTV Desk 2018-05-15 17:37:18  NTR, TRIVIKRAM MOVIE, HEROINE RAMBHA, KEY ROLE

హైదరాబాద్, మే 15 : నిన్నటి తరం హీరోయిన్ రంభ.. అగ్రహీరోలందరితో తెరను పంచుకుంది. ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ భామ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. చాలాకాలం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన "యమదొంగ" చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాటలో అలరించింది. తాజాగా మరోసారి ఎన్టీఆర్ సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రంభ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రంభ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలో కీలకమైన పాత్రలను సీనియర్ హీరోయిన్ లతో చేయిస్తారు. అలా వచ్చిన వారిలో నదియా.. స్నేహా.. ఇప్పుడు రంభ ఉన్నారు.