కిడ్నాప్ అయిన విద్యార్ధి

SMTV Desk 2017-07-08 17:27:44  delli, Kidnapped, student

న్యూఢిల్లీ, జూలై 8 : గద్వాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలోని మెట్రో ఆస్పత్రిలో పీజీ వైద్య విద్య చదువుతున్నాడు. గురువారం రాత్రి శ్రీనివాస్ గౌడ్ కారులో ప్రయాణిస్తుండగా క్యాబ్ డ్రైవర్ విద్యార్ధి కళాశాలకు ఫోన్ చేసి కిడ్నాప్ చేసినట్లు చెప్పాడు. శ్రీనివాస్ గౌడ్ ను వదిలేందుకు దుండగుడు 5 కోట్ల రూపాయలని డిమాండ్ చేసాడని, దీంతో ఢిల్లీలోని ప్రీత్‌విహార్ పోలీసు స్టేషన్‌లో కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని రక్షించాలని పోలీసులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. పోలీసులు యువకుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.