ఆ పార్టీ పేరు మార్చుకోవాలి : మధ్యప్రదేశ్‌ సీఎం

SMTV Desk 2018-05-15 15:15:09  #karnataka elections,Shivraj Singh Chouhan, congress-jds, bjp,

భోపాల్‌, మే 15 : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పేరు మార్చుకోవాల్సిన సమయం దగ్గర పడిందని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుండటంపై ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్ ‌(ఐఎన్‌సీ) తన పేరును మార్చుకోవాలి. అందుకు సమయం దగ్గర పడింది. కర్ణాటక ఫలితాలే అందుకు నిదర్శనం ఐఎన్‌సీను కాంగ్రెస్‌(పీఎంపీ-పంజాబ్‌, మిజోరాం, పుదుచ్చేరి) అని పెట్టుకోవాలి " అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ మూడు రాష్ట్రాల మొదటి అక్షరాలు కలిసి వచ్చే విధంగా చౌహాన్‌ కాంగ్రెస్‌ పార్టీకు పేరు పెట్టారు. భాజపా ఆధిక్యం దిశగా దూసుకెళ్లడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌, పార్టీ కార్యకర్తల కృషి ఫలితమే "అని భాజపా నేత రాంమాధవ్‌ అన్నారు.