జగన్ పై సీబీఐ కోర్టు ఆగ్రహం

SMTV Desk 2017-07-08 16:54:36  ycp, jagan, cbi, cort

అమరావతి, జులై 7 : జగన్ తరుపున న్యాయవాది వేసిన పిటిషన్ పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గుంటూరులో పార్టీ ప్లీనరీ సమావేశం కారణంగా జగన్ విచారణకు హాజరు కాలేక పోతున్నారని ఆయన తరుపు న్యాయవాది వివరించాడు. రాజకీయ కారణాలతో కోర్టుకు హాజరు కాకపోవడం మంచిది కాదని, మరోసారి ఇదే పునరావృత్తమైతే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. అనంతరం ఈ నెల 21 న తదుపరి విచారణకు రావాలని జగన్, విజయసాయిరెడ్డి లను సీబీఐ కోర్టు ఆదేశించింది.