తారుమారైన ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు

SMTV Desk 2018-05-15 11:41:04  #karnatakaelections, exit polls, bjp, congress

కర్ణాటక, మే 15 : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్ వెలువరించిన అభిప్రాయాలూ తారుమారు అయ్యాయి. ముందు నుండి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని... హంగ్ ఏర్పడే అవకాశం ఉందని సర్వేలు బల్లగుద్ది చెప్పాయి. కన్నడ ఓటర్లు వాటిని తలకిందులు చేస్తూ తమ తీర్పును చెప్పారు. ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరా హోరి పోటీ ఉంటుందని... జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అందరు ఉహించారు. అనూహ్యంగా కమలం పార్టీ మేజిక్ ఫిగర్ కు అటుగా ఇటుగా సాధించే వైపుగా అడుగులు వేస్తుంది. సర్వే ఫలితాల నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై అటు ప్రజలలోను, నాయకుల్లోనూ సర్వత్రా ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో మళ్లీ అధికారం చేపట్టాలనే కాంగ్రెస్ ఆశలపై ప్రజలు నీళ్ళు చల్లారు. మరో వైపు కింగ్ మేకర్ పాత్ర పోషించాలన్న జేడీఎస్ పార్టీకు కూడా నిరాశే మిగిలింది. 224 నియోజకవర్గాలున్న కర్ణాటకలో ఈ నెల 12న 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 113 సీట్లు దక్కించుకోవాలి. బీజేపీకు మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువగా స్థానాలు సాధించేలా అవకాశం ఉండడంతో ఒంటరిగానే అధికారం చేపట్టాలని ఆ పార్టీ ఆలోచిస్తుంది.