జీఎస్టీ ఎఫెక్ట్ సినిమా పై

SMTV Desk 2017-07-08 16:23:54  gst, Movies, entertainment, tax, Exception

చెన్నై, జూలై 8 : జీఎస్టీ పుణ్యమా అని టికెట్ ధర రూ.120 టికెట్ ధర రూపాయలను 153కు విక్రయించారు.జీఎస్టీని వ్యతిరేకిస్తూ రాష్ట వ్యాప్తంగా థియేటర్స్ యజమానులు నాలుగు రోజులు సమ్మె చేపట్టారు. ఆ కారణంగా 80 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు థియేటర్స్ యజమానులు సంఘంనాయకులూ తెలిపారు. గురువారం థియేటర్ల యజమానులు సంఘాల ప్రతినిధులు మంత్రులు జయకుమార్, వీరమణి, కడంబూర్‌ రాజు చర్చలు జరిపారు. ఈచర్చలు జరిపేందుకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని థియేటర్ల యజమానులు సినీ రంగానికి చెందిన ఆరుగురు సభ్యులు ఉంటారని నాయకుడు అభిరామి రామనాథన్‌ గురువారం ప్రకటించారు. రూ.120 టికెట్ ను జీఎస్టీ ప్రభావంతో 153 విక్రయించారు. అంటే జీఎస్టీ తో 33 ఆదనపు పన్ను కట్టాల్సి వస్తుంది. దీంతో ప్రతి టికెట్ ఖరీదు పై అదనంగా జీఎస్టీ పన్ను మోత పెట్టడం తో దీనిపై సినిమా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవ్వడంతో ఉదయాన్నేసినిమా ప్రేక్షకులు ఉరుకుల పరుగులతో వెండి తెరపై బొమ్మల కధలాడక లబోదిబోమన్న థియేటర్లలో మళ్లీ ప్రేక్షకుల సందడి మొదలైయింది.