‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్ రిలీజ్..

SMTV Desk 2018-05-14 16:41:10  hello guru prema kosame, first look release, hero ram, anupama parameshvaran.

హైదరాబాద్, మే 14 : యంగ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "హలో గురు ప్రేమకోసమే". త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. హీరో రామ్ పుట్టిన రోజు మే 15 సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రామ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఫాలో అవుతున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.