మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతం!!!

SMTV Desk 2017-07-08 15:54:02  china,india, war

చైనా, జూలై 08 : భారత్-చైనా, ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత రోజు రోజుకి పెరుగుతోంది. ఓ వైపు హిందూ మహా సముద్రంలోని భూభాగంలో జలాంతర్గాములు, మరో వైపు యుద్ద నౌకలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. భారత్ లోని నేవీ స్థావరాలైన కోల్ కత్తా, విశాఖ, చెన్నై వంటి ప్రదేశాలను సబ్ మెరైన్ లు నిశ్శబ్ధంగా దెబ్బ తీసే అవకాశం ఉంది. అదే జరిగితే నష్టం భీబత్సంగా ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో రెండు దేశాలకు ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే!! ఇరు దేశాల అధినేతలు ఈ ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చటానికి సహకరించుకుంటారా, లేదా? ఈ అంశం పై ఇప్పటి వరకు సానుకూల సమాధానం మాత్రం రాలేదు. అయితే నిన్న జరిగిన G20 దేశాల సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పరస్పర కరచాలనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొంటున్న ఘర్షణ వాతావరణం గూర్చి ఇరు దేశాల నాయకుల చర్చించుకొనప్పటికి జరిగిన G20 సమావేశం లో మాత్రం బ్రిక్స్ సమావేశాల పట్ల ఒకరి పై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ఇదిలా ఉండగా సిక్కిం నుండి వైదొలగనంత వరకు చర్చల ప్రసక్తే లేదని చైనా ఇంకా మొండిగానే వాదిస్తుంది. అనంతరం దీని గూర్చి రిటైర్డ్ నేవీ ఆఫీసర్ బి.ఎల్.ఎన్. రావు మాట్లాడుతూ, భారత్ భూభాగం లోకి చొచ్చుకు రావటానికి డోక్లంలో చైనా రోడ్లు వేస్తుందని అంత మాత్రాన హద్దులు మీరాలని చూస్తే ఆ రోడ్లను ధ్వంసం చేయడానికి భారత్ బ్రహ్మోస్ క్షిపణులు అప్రమత్తంగా ఉంచిందని ఈ సందర్భంగా పేర్కొన్నరాయన. ఒకవేళ పరిస్థితి చేయి దాటి పోతే యుద్ధం వస్తుందా? వస్తే నష్టం ఎవరికీ? చైనాకా, భారత్ కా? ఇదే ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఈ సారి యుద్ధం జరిగితే 1962 నాటి కన్న ఎక్కువ నష్టం భారత్ కు తప్పదని ముందుగా హెచ్చరించింది చైనా. భారత్ కూడా అప్పటి లాగా లేదని ప్రస్తుతం భారత్ లో చాలా మార్పులు జరిగాయని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చైనాను తీవ్రంగా హెచ్చరించారు. అసలు విషయానికొస్తే, యుద్ధం అంటూ చేయ్యాల్సి వస్తే దాని కోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. అసలు భారత్ కన్న కూడా ఆర్ధిక వ్యవస్థ 5 రెట్లు చైనాకే ఎక్కువ. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే రెండు దేశాల మధ్య ఆర్ధిక బంధం తెగిపోతుంది. అదే జరిగితే ఎక్కువ నష్టం భారత్ కే వాటిల్లుతుందని నిపుణులు వాదిస్తున్నారు. వాణిజ్య విలువలు : # భారత్-చైనా మధ్య వాణిజ్యం విలువ 70 బిలియన్ డాలర్లు. చైనాకు భారత్ ఎగుమతి చేయడం కన్న ఆ దేశం నుండి పలు వస్తువులు దిగుమతి చేసుకోవడమే ఎక్కువ. (i) భారత్ కు చైనా ఎగుమతులు - 58.33 బిలియన్ డాలర్లు. (ii) చైనాకు భారత్ ఎగుమతులు - 11.76 బిలియన్ డాలర్లు. అంటే భారత్ కు వాణిజ్య లోటు 46. 56 బిలియన్ డాలర్లు అన్న మాట.. ఇది గ్రహించిన చైనా, ఎగుమతులు ఆపేసిన తమకేం నష్టం లేదంటూ ధీమా వ్యక్తం చేసింది.