డబుల్ బెడ్రూం సామూహిక గృహప్రవేశాలు

SMTV Desk 2017-07-08 14:33:10  Double bedroom house construction, Massive home affairs,NewGuide District, Roads and Buildings Minister Thummala Nageshwar Rao, MP Pongalati Srinivas Reddy, Tricker Chairman Patti

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం గృహ నిర్మాణానికి సంబంధించిన సాముహిక గృహప్రవేశాలు శుక్రవారం నాడు కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. ఈ కార్యకమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ట్రికర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్ పర్సన్ కవిత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో సహా పలువురు అధికారులు, నేతలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్ లో 20 డబుల్ బెడ్రూం గృహాలు మంజూరయ్యాయన్నారు. ఈ గృహ నిర్మాణాలు పూర్తి అవ్వడంతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు లబ్దిదారులు సంతోషం వ్యక్తపరుస్తూ సీఎం కేసీఆర్ కు తాము రుణపడి ఉంటామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గృహాలను నిర్మించి, లబ్దిదారులకు మంజురుచేస్తామని మంత్రి వెల్లడించారు.