వాట్ ఏ షాట్... వాట్ ఏ ఫీలింగ్..

SMTV Desk 2018-05-13 18:10:23  virat kohli, abd shot, ip, rcb vs delhi dare devils, ipl-11

ఢిల్లీ, మే 13 : కోహ్లి షాట్ లు కొడితే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అతని కొట్టే ప్రతి షాట్ కు అభిమానులు మైదానంలో చాలా ఆనందిస్తారు. అయితే మరో బ్యాట్స్‌మన్‌ కొట్టిన సిక్స్‌కు కోహ్లీనే ప్రేక్షకుడిగా మారి ముగ్ధుడైతే ఎలా ఉంటుంది?. ఇలాంటి అరుదైన ఘటన నిన్న ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. తన సహచరుడు డివిలియర్స్‌ కొట్టిన ఓ షాట్‌కు కోహ్లి ఫిదా అయిపోయాడు. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. కెప్టెన్‌ కోహ్లీ(70), మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌(72 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కోహ్లీ ఔట్‌ అనంతరం.. ఏబీ తన దూకుడును కొనసాగించాడు. 19వ ఓవర్‌లో ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన లోఫుల్‌టాస్‌ బంతిని ఏబీ స్కేర్‌‌ లెగ్‌ దిశగా చూడచక్కటి సిక్స్‌ బాదాడు. అద్భుతమైన ఈ షాట్‌కు డగౌట్‌లో ఉన్న కోహ్లీ ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.