పని మనిషి పై అత్యాచారం

SMTV Desk 2017-07-08 12:58:17  Lawyer, is, a maid, of, rape

నాగోల్, జులై 7 : నాగోల్ లో నివసించే ప్రకాశ్ (60) వృత్తిరీత్యా న్యాయవాది. అతడి కుటుంబ సభ్యులందరూ కొన్ని రోజుల క్రితం కొంపల్లికి వెళ్ళడంతో ఇంట్లో ప్రకాశ్‌ ఒక్కడే ఉంటున్నాడు. తన ఇంట్లో పనిచేసేందుకు పని మనిషి కావాలని సెక్యూరిటీ గార్డు కృష్ణకు చెప్పాడు. కృష్ణ తనకు తెలిసిన మరో సెక్యూరిటీ గార్డు ద్యారా యూసఫ్ గూడకు చెందిన ఓ మహిళ ఉందని కృష్ణ చెప్పాడు. యూసఫ్ గూడకు చెందిన మహిళ (43)ను జూన్ 29 న ప్రకాశ్ ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆమె తినే ఆహారంలో వారు మత్తు మందు కలిపి ఇచ్చారు. కొద్ది సేపటికే ఆమె సృహ కోల్పోవడంతో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారం క్రితం జరిగిన ఈ దారుణాన్ని భాదితురాలు బంధువుల దృష్టికి తీసుకెళ్ళింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ గురురాఘవేందర్‌ తెలిపారు.