హంగ్ వస్తే... జేడీఎస్ మద్దతు వారికే..!

SMTV Desk 2018-05-12 20:37:18  karnataka elections, jds king maker, bip, congress

కర్ణాటక, మే 13 : కన్నడ నాట ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన ఈ ఎన్నికల సమరం కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ హోరాహోరిగా ప్రచారం సాగించాయి. పునరాధికరం సాధించాలని కాంగ్రెస్, దక్షణాదిలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తుంది. మరో వైపు సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హంగ్ ఏర్పడితే మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ (జీడీఎస్) కీలకంగా మారనుంది. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి జేడీఎస్ మద్దతు బీజేపీకేనని అందరూ భావించారు. అయితే, ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని, అది తమ బాధ్యత అని జేడీఎస్ అధికార ప్రతినిధి డానిల్ అలీ తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, జేడీఎస్‌ను బీజేపీ-బి టీమ్‌గా అభివర్ణించారు. రాహుల్ ఆరోపణలను దేవెగౌడ కొట్టివేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత జేడీఎస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి అయిన డానిష్ అలీ మాట్లాడుతూ.. "బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌కు ఒకవేళ మెజారిటీ రాకుంటే, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే.. అప్పుడు మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా" అని పేర్కొన్నారు.