కన్నడ సమరం : హంగ్ ఏర్పడే అవకాశం..!

SMTV Desk 2018-05-12 18:56:39  #karnataka elections, exit polls, survey of karnatka elections, karnataka

బెంగుళూరు, మే 12 : కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్నాటక ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. మొత్తం 224 స్థానాలకుగానూ 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు తహతహలాడుతున్నాయి. కానీ ముందు నుండి కొన్ని సంస్థల సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పాయి. జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ అవుతుందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా: కాంగ్రెస్: 106-118 బీజేపీ: 79-92 జేడీఎస్‌: 22-30 ఇతరులు: 1-4 టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌: కాంగ్రెస్: 90-103 బీజేపీ: 80-93 జేడీఎస్‌: 31-39 ఇతరులు: 2-4 రిపబ్లిక్‌ టీవీ- జన్‌ కీ బాత్‌: కాంగ్రెస్: 73-82 బీజేపీ: 95-114 జేడీఎస్‌: 32-43 ఇతరులు: 2-3