కుమ్మేసిన కోల్‌కతా... పంజాబ్ లక్ష్యం 246

SMTV Desk 2018-05-12 18:11:52  kkr vs kingsx1, ipl, sunil narine, indore

ఇండోర్, మే 12 : ఐపీఎల్ టోర్నీలో భాగంగా కింగ్స్ X1 పంజాబ్- కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టులో ఒకరికి మించి ఒకరు రెచ్చిపోయి ఆడారు. మ్యాచ్ గెలవాలన్న కసితో పంజాబ్ బౌలర్లపై సిక్స్ లు, ఫోర్ల తో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌ (75; 36 బంతుల్లో 9×4, 4×6) తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌ (50; 23 బంతుల్లో 5×4, 3×6), రస్సెల్ (31) ఆ బాధ్యత తీసుకున్నారు. ఫలితంగా కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. కింగ్స్‌ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు సాధించగా.. బరిందర్‌ శ్రాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.