టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

SMTV Desk 2018-05-12 15:59:31  kings X1 punjab, kkr vs kings X1 punjab, ipl, indore

ఇండోర్, మే 12 : ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగబోతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇండోర్ లోని హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ గెలుపొందింది. ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ 10 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపొంది మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్‌ 11 మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఐదో స్థానంలో ఉంది. తుది జట్లు... కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, శుభ్‌మాన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఆండ్రీ రస్సెల్‌, జావోన్‌ సీర్లెస్‌, పీయూష్‌ చావ్లా, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌ కింగ్స్‌ పంజాబ్‌ : అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అరోన్‌ ఫించ్‌, కరుణ్‌ నాయర్‌, అక్షర్‌ పటేల్‌, ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, బరీందర్‌ శ్రాన్‌, ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌