ఈ నెల 30, 31న బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

SMTV Desk 2018-05-11 19:26:44  BANK PROTEST, MAY 30, 31, SALARY INCREASE ISSUE.

హైదరాబాద్, మే 11 : వేతన పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోకపోవడంతో దేశ వ్యాప్తంగా ఈనెల 30, 31న సమ్మె చేయనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారని తెలిపింది. మే 30న ఉదయం ఆరు గంటల నుంచి జూన్‌ 1 ఉదయం ఆరు గంటల వరకూ ఈ సమ్మె జరగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌ వెల్లడించింది. 2017 నవంబర్‌ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె విషయంపై ఇప్పటికే తాము సంబంధిత అధికారులకి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.