కర్ణాటకలో రూ.2.17కోట్ల డబ్బు పట్టివేత

SMTV Desk 2018-05-11 18:29:51  karnataka elections, money cease 2.17 crore, election commission, karnataka elections

బెంగళూరు, మే 11 : కర్ణాటక ఎన్నికలు పారదర్శకంగా చేయాలనీ ఈసీ భావిస్తున్న అక్కడక్కడ ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు జరగబోయే ఈ మహా సమరంకు గురువారంతో ప్రచార పర్వం ముగిసింది. కాగా పలు పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నగదు, మద్యం, ఇతర కానుకలను పంపుతున్నాయి. వీటిని ఆడుకొనేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ట చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు సోదాలు చేపట్టి చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరులోని ఎద్దలబొమ్మనహట్టి వద్ద రూ.2.17కోట్ల నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి మొలకల్మూరుకు స్కార్పియోలో నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఐటీ, పోలీసు, అబ్కారీ శాఖల తనిఖీల్లో రూ.80.91కోట్ల నగదు, రూ.24.36 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.44.26 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఐటీశాఖ.. ఇప్పటి వరకూ రూ.176 కోట్ల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసింది.