ఇకపై క్యాస్టింగ్ కౌచ్ భయం అక్కర్లేదు..

SMTV Desk 2018-05-11 17:35:54  CASTING COUCH, SELEB SELECT YAP, MARUTHI.

హైదరాబాద్, మే 11 : తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదిపేసిన వార్త.. కాస్టింగ్ కౌచ్. సినిమాల్లోకి రావాలంటే కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని.. తమకు న్యాయం చేయాలంటూ నటి శ్రీరెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త యాప్‌ను ఆవిష్కరించారు. ఎటువంటి భయాలు లేకుండా నేరుగా సినిమా అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన సరికొత్త "సెలబ్ కనెక్ట్" యాప్‌ను దర్శకుడు మారుతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుందని.. గూగుల్ ప్లే స్టోర్ నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ లో పొందుపరచిన వివరాల ప్రకారం అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. దీంతో సినీ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తగ్గుతుందని పేర్కొన్నారు.