అంతమాత్రానా కమ్‌ బ్యాక్‌ అని రాసేయకండి..

SMTV Desk 2018-05-11 16:19:06  heroine pranitha, hello guru prema kosame movie, ram hero,

హైదరాబాద్, మే 11 : అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ఈ బొంగరాల్లాంటి కళ్ళ చిన్నది.. సినిమాలేమి చేయకుండా కాస్తంత కనుమరుగైపోయింది. కానీ ఇటీవల తిరిగి సినిమాల్లో నటించడానికి రంగం సిద్దమైనట్లుంది. మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ కథానాయకుడిగా త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "హలోగురు ప్రేమకోసమే". ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రణీత నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రణీతకు కమ్‌ బ్యాక్‌ సినిమా అని పలువురు అంటున్నారట. దీనిపై ప్రణీత స్పందిస్తూ.. "సినిమాలను వదిలి ఎక్కడికో వెళ్లలేదు. దక్షిణాది భాషల్లో నటిస్తూనే ఉన్నా. ఒక భాషలో నటిస్తున్నప్పుడు మరో భాషలో ఆ గ్యాప్‌ కనిపిస్తుంది. పైగా నా దగ్గరకు వచ్చిన అన్ని స్ర్కిప్ట్‌లకు ఓకే చెప్పేసి నిర్విరామంగా నటించే రకం కాదు నేను. ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటాను. అలాంటప్పుడు కాస్త విరామం తీసుకున్నట్టుగానే ఉంటుంది. అంత మాత్రానికే కమ్‌ బ్యాక్‌ అని, రీ ఎంట్రీ అని రాసేయకండి" అని కాస్తంత గట్టిగానే సమాధానమిచ్చారు.