అల్పాహారం ఆరగించండి..!

SMTV Desk 2018-05-11 15:36:51  MORNING BREAK FAST, TIFFIN, IDLY TIFFIN, HYDERABAD

హైదరాబాద్, మే 10 : ఉదయం పూట తినే అల్పాహారం శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అందుకే అన్ని పనులున్న టిఫిన్ మాత్రం తినడం మానేయకూడదు. దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. >> చాలామంది ఉద్యోగం చేసే మహిళలు ఉదయం టిఫిన్ తీసుకోవడంలో అనాసక్తి చూపిస్తారు. దీనికి వారు చెప్పే కారణం సమయం లేకపోవడమే. కానీ తినడం వల్ల రోజువారీ పనులకు అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది. >> కొంతమంది మహిళలు టిఫిన్‌ మానేయడం వల్ల బరువు తగ్గుతామనుకుంటారు. ఇది నిజం కాదు. మధ్యాహ్నాం ఎక్కువగా తీసుకుంటారు. దాంతో బరువు ఎక్కువగా పెరుగుతారు. అందుకే ఒక శాండ్‌విచ్‌ అయినా తీసుకోవాలి. >> రాత్రి భోజనం తరువాత ఉదయం వరకు మన పొట్ట దాదాపు ఎనిమిది గంటలపాటు ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేచిన గంటా, రెండు గంటల్లోపు ఏదో ఒకటి తినడం మంచిది. >> అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆ రోజంతా అలసటగా ఆనిపిస్తుంది. రక్తంలో చక్కెరస్థాయులు కూడా తగ్గుతాయి. దాంతో నీరసంగా మారిపోతారు.