వివాదంలో "భరత్ అనే నేను"..

SMTV Desk 2018-05-10 19:11:36  BHARATH ANE NENU, MAHESH BABU, LEGAL NOTICE, NAVODAYAM PARTY.

హైదరాబాద్, మే 10 : ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన "భరత్ అనే నేను" ఘన విజయం సాధించి ఇప్పటికే 200 కోట్ల క్లబ్బులో చేరిన విషయం తెలిసిందే. అలాంటి ఈ చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల సంఘం నియామళి, కాపీరైట్ చట్టానికి విరుద్దంగా.. తాము స్థాపించిన "నవోదయం పార్టీ" పేరు, జెండా, గుర్తును ఆ సినిమాలో వినియోగించుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపించారు. నవోదయం పార్టీని 2012లోనే స్థాపించి ఎన్నికల సంఘం గుర్తింపు పొందామని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రంలో నవోదయ పార్టీ వ్యవస్థాపకుడిని ఒక క్రిమినల్ గా చూపించారని అందువల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చి నష్టం జరిగే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయవాది ద్వారా దర్శకుడు, నిర్మాతలకు లీగల్ నోటిసులు పంపించామని.. వెంటనే సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సీన్ లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.