పెళ్ళితో ఒక్కటైన మరో బాలీవుడ్ జంట..

SMTV Desk 2018-05-10 18:57:27  NEHA DHUPIYA, AGANDH BEDI, MARRIAGE, BOLLYWOOD.

హైదరాబాద్, మే 10 : బాలీవుడ్ లో పెళ్ళిళ్ళు వరుస కట్టాయి. ఇటీవల అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్, ఆనంద్ అహూజల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ జంట నేహా ధూపియా, అంగధ్ బేడీలు పెళ్లి చేసుకున్నారు. ఇంతకు అంగధ్ బేడీ ఎవరంటే.. క్రికెట్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు. ఈ సందర్భంగా నేహా ధూపియా, ఆనంద్ అంగధ్ లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. "నా జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయ౦. నా బెస్ట్ ఫ్రెండ్ ను ఈరోజు పెళ్లి చేసుకున్నా" అని నేహా ట్వీట్ చేయగా.. "నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు భార్య అయింది" అంటూ అంగధ్ ట్వీట్ చేశాడు. నేహా ధూపియా వయసు కన్నా అంగధ్ రెండేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.