గులాబి జెర్సీల్లో రాజస్థాన్ ప్లేయర్స్..

SMTV Desk 2018-05-10 16:56:35  rajastan royals, ipl, pink dress rajastan royals, ipl-11

జైపుర్, మే 10 ‌: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు గులాబి రంగు జెర్సీల్లో ఆడనున్నారు. క్యాన్సర్‌ గురించి అవగాహన పెంచే కార్యక్రమంలో గులాబి దుస్తులు ధరించనున్నారు. క్యాన్సర్‌ గురించి అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజస్థాన్‌ ఆటగాళ్లు, హెన్రిచ్‌ క్లాసన్‌, గౌతమ్‌, లొమ్రార్‌లు క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకున్నారు. "మా ప్రయత్నం చిన్నదే కావొచ్చు. కానీ క్యాన్సర్‌ రహిత సమాజం దిశగా ఇదో ముందడుగు. ప్రజల్లో వీలైనంత అవగాహన పెంచేందుకు మా శక్తి మేర ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం" అని రహానె వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-11సీజన్ లో రహనే సారథ్యంలో ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ జట్టు 4 మ్యాచ్ ల్లో నెగ్గి ఆరింట ఓడి... పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్ కు అవకాశాలు సజీవంగా ఉండాలంటే మిగతా అన్ని మ్యాచ్ ల్లో తప్పక విజయం సాధించాలి. టోర్నీలో భాగంగా తన తదుపరి మ్యాచ్ ను రాజస్థాన్ 11న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.