ఆయనను పెళ్లి చేసుకోవడానికి సిద్దమే : నికీషా

SMTV Desk 2018-05-10 14:45:15  nikisha patel, puli movie, favorite hero prabhudeva.

హైదరాబాద్, మే 10 : "పులి" సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన హీరోయిన్ గుర్తుందా..!! నికీషా ప‌టేల్‌. పులి సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైన నికీషా.. ఈ చిత్రం పరాజయం తరువాత కనుమరుగైపోయింది. తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేక... క‌న్న‌డ‌, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌పై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె త‌మిళంలో "పాండిముని" సినిమాలో న‌టించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా త‌న‌కు న‌చ్చిన హీరో గురించి మాట్లాడుతూ.. "నాకు న‌చ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్ర‌భుదేవా న‌టన‌, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న కుటుంబానికి, మా కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఆయ‌న‌తో క‌లిసి న‌టిస్తారా? అని అడుగుతుంటారు. క‌లిసి న‌టించ‌డం కాదు.. ఆయనను పెళ్లి చేసుకోవ‌డానికైనా సిద్ధ‌మే" అని నికీషా వెల్లడించింది.