యుద్ధ కసరత్తు చేస్తున్న చైనా సైన్యం

SMTV Desk 2017-07-07 18:39:52  India-China border, Sikkim, Chinas armies, Tibet,Battle tank,China Government Media Agency Xinhua News Agency

బీజింగ్, జూలై 7 : భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత, సిక్కిం ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చైనా సైన్యాలు యుద్ధ కసరత్తులు చేపట్టింది. టిబెట్ లో ఎత్తైన ప్రాంతాల్లో నిజమైన యుద్ధంలో ఎదురయ్యే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించిన చైనా సైన్యం విన్యాసాలు చేస్తోంది. తేలికపాటి యుద్ధ ట్యాంకులను సహా ఇతర ఆయుధ వ్యవస్థను పరీక్షిస్తుంది. సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో ఈ విన్యాసాలు జరుగుతున్నాయని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించారు. తాజా సరిహద్దు వివాదం నుంచి భారత్‌ వెనక్కి తగ్గాలని, లేదంటే స్వాతంత్య్రం కోసం సిక్కింలో వస్తున్న డిమాండ్లకు బీజింగ్‌ మద్దతివ్వాల్సి వస్తుందని చైనా మీడియా భారత్‌ను హెచ్చరించింది. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వెలువడే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ఈ మేరకు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. గతంలో భారత్‌ దలాలైమా కార్డు ఉపయోగించి చైనాను అడ్డుకునేది. కానీ ఇప్పుడు ఆ కార్డు పనికిరాకుండా పోయింది. ప్రస్తుతం ఆ కార్డు టిబెట్‌పై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.