ఇషాన్ ఇరగదీశాడు..

SMTV Desk 2018-05-10 11:23:05  ishan kishan, mumbai indians, ipl, kkr

కోల్‌కతా, మే 10 : ఐపీఎల్ లో ఇక నుండి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు జూలు విదిల్చింది. టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఏకంగా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై జట్టులో ఇషాన్‌ కిషన్‌ (62; 21 బంతుల్లో 5×4, 6×6) కేకేఆర్ బౌలర్లను తుత్తునియలు చేస్తూ తన విశ్వరూపం చూశాడు. మొదట టాస్ నెగ్గిన కోల్‌కతా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టులో ఇషాన్ కిషాన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్(36), రోహిత్ శర్మ(36), బెన్ కటింగ్(24) రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోయింది. ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్య (2/12), హార్దిక్‌ పాండ్య (2/16)లతో పాటు మిగతా బౌలర్లూ సమష్టిగా సత్తా చాటడంతో కోల్‌కతా 18.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇషాన్ కిషాన్ కు దక్కింది.