ఇకపై రైల్వేలోను "గివ్ అప్" సబ్సిడీ

SMTV Desk 2017-07-07 18:33:39  new delli, train, jammu, express,

ఢిల్లీ, జూలై 07 : ఒక ప్రయాణికుడు ఇటీవల జమ్ము రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించాడు, ఆ వ్యక్తికి కంప్యూటర్ ద్వారా వచ్చిన టిక్కెట్ పై 43 శాతం రాయితీ రైల్వే భరిస్తోంది అని ఉంది. ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కి ఆ రాయితీ మొత్తం 950 అయిందని, ఇలాంటి రాయితీలు ఇక ముందు వాడుకోనని ఓ లేఖలో రాసి పంపాడు. ఐఆర్‌సీటీసీ సొమ్ము తీసుకునేందుకు ఎలాంటి నిభందనలు లేకపోవడంతో, ఆ సొమ్ముతో కూడిన చెక్కును ప్రయాణికునికి తిరిగి పంపించారు. రైల్వే అధికారి అనిల్ సక్సేనా దీని గురించి మాట్లాడుతూ వంటగ్యాస్ పై రాయితీ లాగే రైలు టికెట్ల పై రాయితీ వదులుకోనే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తామని వెల్లడించారు. ఈ సంఘటన వలన కేంద్రం నూతన సాఫ్ట్‌వేర్‌ అమల్లోకి వచ్చిన తరువాత కంప్యూటర్‌ ద్వారా ప్రింటు వేసే టిక్కెట్లపై ‘భారతీయ రైల్వేలు మొత్తం ప్రయాణ ఖర్చులో సగటున 57% మాత్రమే వసూలు చేస్తున్నాయని, 43 శాతం రాయితీ ఇస్తోందని ముద్రిస్తుంది. 50% రాయితీని వదులుకోవడం, 100% రాయితీని వదులుకోవడం అనే వర్గీకరణ చేయనుంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌, కౌంటర్లలోని బుకింగ్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రకటించనుంది.