రైతు రాజ్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: ఈటెల

SMTV Desk 2018-05-09 17:41:43  Rythu Bandhu telangana K.Chandrasekhar Rao Kcr Farmers

కరీంనగర్, మే 9‌: రైతుల ఆర్థిక ఇబ్బందులు తీర్చడంతో పాటు ఆత్మహత్యలు నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు రాజ్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో గురువారం లక్షమంది రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బంధు పథకాన్ని ప్రారంభిస్తారన్నారు.. వచ్చే ఏడాది కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతామని ఈటల తెలిపారు. హుజూరాబాద్‌లో ఈ కార్య‌క్ర‌మం ఉదయం 10 గంటలరే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా ఉద‌యం 11.15 గంట‌ల‌కు అన్ని జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.