లక్ష్మణ్ అకాడమీకి మంత్రి విరాళం

SMTV Desk 2017-07-07 18:21:55  cricketer, vvs laxman, telangana it, minister, ktr

హైదరాబాద్ జూలై 7 : ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అకాడమీకి సాయం అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. గురువారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రూ.10 లక్షల చెక్కును క్రికెటర్ లక్ష్మణ్ కు అందించారు. గతంలో కూడా ఆయనతో భేటి అయిన కేటీఆర్, అకాడమీకి చేయూతనిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేసారు.