స్మిత్ మళ్లీ ఆసీస్ సారథి అవుతాడు : లీమన్

SMTV Desk 2018-05-09 14:45:00   Darren Lehmann, australia former caoch, steve smith, david warner

సిడ్నీ, మే 8 : స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ ఆస్ట్రేలియా జట్టు సారథ్య బాధ్యతలు చేపడతాడని లీమన్‌ అభిప్రాయపడ్డాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్‌కు తాజాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్ (ఎన్‌పీఎస్‌)కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు 9నెలల పాటు నిషేధం ఉన్న బాన్‌క్రాఫ్ట్ చాలా మంచివాళ్లని ఆయన చెప్పాడు. ఓ స్థానిక రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లీమన్‌ మాట్లాడుతూ.."ఆ ముగ్గురు మంచి వ్యక్తులని..నిషేధం పూర్తైన తర్వాత తప్పకుండా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతారని ఆశిస్తున్న. ప్రతి ఒక్కరూ వారిని క్షమిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ ఆస్ట్రేలియా జట్టు సారథ్య బాధ్యతలు చేపడతాడు" లీమన్‌ వ్యాఖ్యానించాడు.