పిల్లలు కాదు.. పిడుగులు..!

SMTV Desk 2018-05-09 14:24:20  childrens care, children playing, parents care children, hydarabad

హైదరాబాద్, మే 8 : చిన్నపిల్లలు అల్లరి చేయడం ఒక విధంగా సరదాగా ఉంటుంది. కానీ అది శ్రుతిమించితే మాత్రం ఆ అల్లరికి అడ్డుకట్ట వేయడం తప్పనిసరి. అలానే కొడితే మొండి అవుతారు. వారిని నియంత్రించడానికి ఇవి చేయండి. >> పిల్లలు ఏదైనా వస్తువుని పాడుచేసినా, పారేసినా కోపంగా నాలుగు దెబ్బలు వేయడం సరికాదు. దానివల్ల వారు ఆ సందర్భం వరకూ మౌనంగా ఉంటారు తప్ప..మళ్లీ ఎప్పటిలానే చేస్తారు. బదులుగా ఏం చేయాలనేదీ వివరించండి. కావాలనే చేస్తే ఆ వస్తువు విలువ తెలిసేలా చేయండి. మరోసారి అడిగినప్పుడు కొనివ్వకండి. >> వేలెడంత లేదు బోలెడు పెద్ద మాటలు.. పెద్ద ఆరిందలా ఇంట్లో అందరినీ ఎదిరిస్తోందీ.. అని పిల్లల్ని అంటూ మురిసిపోతుంటాం కొన్నిసార్లు. మొదట్లో వాళ్ల మాటలు ముద్దుగా అనిపించినా.. ఎప్పటికప్పుడు నియంత్రణలో పెట్టాలి. లేదంటే పిల్లలు తామేదో ఘనకార్యం చేస్తున్నామని భావిస్తారు. అందుకే వయసుకి తగ్గట్లుగా మాట్లాడటం, పెద్దలను గౌరవించడం ముందునుంచే నేర్పించాలి.