మా బృందంలోకి స్వాగతం.. : అనుష్క శర్మ

SMTV Desk 2018-05-09 13:09:48  sonam kapoor marriage, anushka sharma, twitter, anushka sharma wishes.

ముంబై, మే 9 : బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అనుష్క శర్మ, ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి గత ఏడాది డిసెంబర్ లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడదే కోవలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె.. కథానాయిక సోనమ్ కపూర్ కూడా చేరింది. తన ప్రియుడు, ఢిల్లీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ ఆహుజాను సోనమ్ పెళ్లి చేసుకుంది. పలువురు బాలీవుడ్ స్టార్లు ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం అందుబాటులో లేని అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు అనుష్క ట్విట్టర్ లో.. "మా బృందంలోకి (పెళ్లైన వారని ఉద్దేశించి) స్వాగతం.. సుస్వాగతం. సంతోషం, ప్రేమానురాగాలతో ఇద్దరూ కలకాలం వర్థిల్లాలి. వ్యక్తి జీవితంలో వైవాహిక ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. ప్రేమ, వృద్ధి ఉంటాయి" అంటూ ట్వీట్ చేసింది.